Ananthapuram SSBN College : అనంతపురం ఎస్ఎస్‌బీఎన్ కాలేజ్ లో అసలు ఏం జరుగుతోంది..?
అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలనే నినాదంతో నెలరోజుల క్రితం విద్యార్థులు చేసిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీయటంతో....ప్రభుత్వం విద్యార్థులకు డిమాండ్లకు తలొగ్గింది. ఎయిడెడ్ రద్దు ఆలోచనపై స్వచ్ఛంద నిర్ణయానికి అవకాశమిచ్చింది. కానీ ఎస్ఎస్‌బీఎన్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం బయటకు వెలుగుచూసిన నేపథ్యంలో విద్యార్థులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. అసలు కళాశాల యాజమాన్యం ఏమనుకుంటుంది...కమిటీ ఏ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది.