Ananthapuram Sachivalaya Udyogulu : సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కదిరి నియోజకవర్గ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ఆర్టిఓ వెంకటరెడ్డి, డీఎస్పీ భవ్యకిషోర్, ఎంపీడీవో రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు ఉద్యోగంలో చేరక ముందు నోటిఫికేషన్లో తెలిపిన విధంగానే ప్రొబెషన్ డిక్లేర్ చేయాలని, సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.