Amit Shah Retirement Plans after Politics | అమిత్‌ షా ఫ్యూచర్​ ప్లాన్స్

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని సహకార సంఘాల మహిళలతో జరిగిన సహకార్ సంవాద్​ కార్యక్రమంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. తన రిటైర్మెంట్​ ప్లాన్స్ ఏంటో చెప్పారు. రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత తన భవిష్యత్‌ పై కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అని అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారు అమిత్ షా. 

రిటైర్మెంట్‌ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయిచాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు అమిత్ షా. రసాయన ఎరువులతో పండించే పంటలతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని.... బీపీ, డయాబెటిస్​, థైరాయిడ్​తో పాటు క్యాన్సర్​ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. అదే ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నా సొంత వ్యవసాయ క్షేత్రంలో కొన్ని రోజులుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాని అన్నారు అమిత్ షా.  దాదాపు ఒకటిన్నర రెట్లు అధిక దిగుబడి వస్తుందని అన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola