15 రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నజేసీ ప్రభాకర్ రెడ్డి

కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కు వచ్చిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ప్రభుత్వ భూములను కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేసుకున్నారని కలెక్టర్ నాగలక్ష్మి కి ఫిర్యాదు. రెవెన్యూ అధికారుల సహకారంతో భూ ఆక్రమణలు జరిగాయి. గతంలో మున్సిపాలిటీకి ధారాదత్తం చేసిన భూములను రిజిస్టర్ చేసుకోవడం పై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, విచారణ కోసం 15 రోజులు గడువు అడిగిన కలెక్టర్ నాగలక్ష్మి. 15 రోజుల అనంతరం తాడిపత్రిలో నేరుగా వెళ్లి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు. భూ దందాలో ఎమ్మెల్యే బంధువులు ఉన్నారని ఆరోపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola