1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
1987, మార్చి 19, ముంబై. రోజు లాగానే అందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. హార్ట్ అఫ్ ది సిటీగా చెప్పుకునే ఓపెరా హౌస్ ప్రాంతం అంతా మెరిసే వజ్రాలు, బంగారు ఆభరణాలతో కలకాలాడుతుంది. అక్కడే త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జావేరీ అనే జ్యువెలరీ షాప్ ఉంది. ఆ రోజు... ఆ షాప్ లో మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగిన ఒక సంఘటనని పోలీసులు ఇప్పటికి మర్చిపోలేరు.
ఈ స్టోరీ అంతా రెండు రోజుల ముందు అంటే మార్చ్ 17వ తేదీన మొదలయింది. 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' న్యూస్ పేపర్ లో ఒక చిన్న క్లాసిఫైడ్ ప్రకటన వచ్చింది. " Dynamic graduates wanted for the posts of intelligence and security officers" అని. ఈ ప్రకటన ఓక అన్నోన్ పర్సన్ నుంచి వచ్చింది. ఈ అన్నోన్ పర్సన్ పేరును పోలీసులు రికార్డ్స్ లో మోహన్ సింగ్ అని చేర్చారు. ముంబైలోని అత్యంత ఖరీదైన హోటల్ తాజ్ ఇంటర్ కాంటినెంటల్ లో మోహన్ సింగ్ రూమ్ బుక్ చేసాడు. అక్కడే కుట్రకు పునాది వేశాడు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ప్రకటన చూసిన నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చిన వారిలో మొత్తం 26 మందిని ఎంపిక చేసుకున్నాడు. ట్రైనింగ్ లో భాగంగా వారితో ఒక మాక్ రైడ్ కూడా చేపిస్తునట్టు నమ్మించాడు.
మార్చి 19న మధ్యాహ్నం.. మోహన్ సింగ్ ఆ 26 మందిని తీసుకోని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జావేరీ షోరూమ్ కు చేరుకున్నాడు. వాళ్ళందరికీ ఫేక్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐడీ కార్డ్స్, జాయినింగ్ లెటర్ ని ఇచ్చాడు. నేరుగా షోరూమ్ యజమాని ప్రతాప్ జావేరి దెగ్గరకు వెళ్ళాడు. తాను CBI అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. సెర్చ్ వారెంట్ ని కూడా చూపించాడు. కస్టమర్స్, స్టాఫ్ ను .. కదలకుండా నిల్చోమని ఆర్డర్ వేసాడు.
ఇక నకిలీ ఆఫీసర్లు అంతా షాపులో తనిఖీ చేయడం మొదలుపెట్టారు. మోహన్ సింగ్ స్వయంగా షో కేసుల్లోని బంగారు, వజ్రాలను సాంపిల్స్ అని చెప్పి గోవర్నమెంట్ సీల్ తో ఉన్న బ్యాగుల్లో వేసి సీల్ చేశాడు. క్యాష్ కౌంటర్ నుంచి డబ్బును సేకరించాడు. మొత్తం 30 నుంచి 35 లక్షల విలువ చేసే బంగారం, డబ్బులని సూట్ కేసు లో పెట్టి బస్సులో పెట్టమని ఆఫీసర్స్ కు చెప్పాడు. ఆ నకిలీ ఆఫీసర్స్ ని అక్కడే ఉండమని చెప్పి.. తాను వేరే దెగ్గరికి సెర్చింగ్ కి వెళ్తునని అదృశ్యమయ్యాడు. ఈ నాటకమంతా 45 నిమిషాల పాటు జరిగింది.
ఎంతసేపైనా మోహన్ సింగ్ తిరిగి రాకపోవడంతో.. షాప్ ఓనర్ కి అనుమానం వచ్చి DB మార్గ్ పోలీసులకు ఫోన్ చేశారు. రైడ్ జరుగుతునట్టుగా మాకు సమాచారం లేదని పోలీసులు చెప్పడంతో తాము మోసపోయ్యామని రియలైజ్ అయి 26 మంది నిరుద్యోగులు, జ్యువెలరీ షాప్ స్టాఫ్, ఓనర్ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. వెంటనే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. కానీ దొరికింది కేవలం మోసపోయిన 26 మంది నిరుద్యోగులు, వారి ఫేక్ ఐడీ కార్డ్స్ మాత్రమే. ఈ దొంగతనం తర్వాత మోహన్ సింగ్ తాజ్ హోటల్ దెగ్గర బస్సుని ఆపాడు. డబ్బు పెట్టలని తీసుకోని అక్కడ నుంచి టాక్సీలో వెళ్ళిపొయ్యాడు. విలే పార్లే ప్రాంతంలో చివరగా కనిపించాడు.
మోహన్ సింగ్ హోటల్ రిజిస్టర్‌లో తన స్వస్థలం కేరళలోని త్రివేండ్రం అని రాశాడు. పోలీసులు కేరళకి వెళ్లి చూసినా ఫలితం లేకుండా పోయింది. అయితే 1986 అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో ఒక ప్రకటన వస్తే దాదాపు 150 మంది నిరుద్యోగులు తాజ్ హోటల్‌లో ఇంటర్వ్యూకు వచ్చారట. కానీ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మాత్రం రాలేదు. అప్పుడు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదట. కానీ ఇదంతా మోహన్ సింగ్ రిహార్సల్ ప్లాన్ అని పోలీసులకు తెలియదు కదా !
ఈ సంఘటన జరిగి ఇన్ని ఏళ్ళు గడిచిపోయినా కూడా మోహన్ సింగ్ అసలు పేరు కూడా ఎవరు కనిపెట్టలేక పొయ్యారు. ఈ సంఘటన ఆధారంగానే స్పెషల్ 26 అనే సినిమాని రూపొందించారు. ఆ కాలంలోనే ఇంత తెలివిగా అలోచించి దొంగతనం చేయడం అంటే మాములు విషయం కాదు. అసలు CBI ఆఫీసర్‌గా ప్రవేశించిన ఆ వ్యక్తి ఎవరు ? ఇంత ధైర్యంగా ఎలా దొంగతనం చేసాడు ? నిజంగా దేశం వదిలి పారిపోయాడా? లేదా ఇండియాలోనే ఉండేవాడా ? అనేది మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.