Bald Head: బట్టతల బాబాయ్ లకు గుడ్ న్యూస్... జుట్టు మొలిపిస్తామంటున్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు

జుట్టే కదా.. 'కాస్తంత' ఊడిపోతే ఏముందిలే అనుకోకండి.. కానీ ఆ కాస్తంతే జుట్టున్న వాళ్లకే తెలుస్తుంది.. ఆ బాధ.. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో బట్టతల సమస్య కూడా ఒకటి. రాలిపోతున్న జుట్టు.. పెరుగిపోతున్న బట్టతలతో మగాళ్లు మరింత జుట్టు పీక్కుంటంటారు. బాబాయ్‌లు అలా  అతిగా ఆందోళన చెందడం వల్ల ఉపయోగమేం లేదు ... ఉన్న కాస్త వెంట్రుకలు పోవడం తప్ప.. అయితే మీ ఆందోళన తీర్చే కబురు ఒకటి వచ్చింది. బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ముందడుగు పడింది. జుట్టును పెంచే ప్రోటీన్ ను హార్వార్డ్ శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. 

ఇక వీవింగులు... విగ్గులతో తంటాలు పడక్కర్లేదు.  జుట్టు రాలిపోయిందే... మొహం వాడిపోయిందే అని ఆందోళనలు పడక్కర్లేదు.. బట్టతలకు ఓ పరిష్కారం వచ్చిందంటున్నారు. మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో నిత్యం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. అలా చాలా ఏళ్లుగా బట్టతల సమస్యపై కూడా పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుక్కునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.బట్టతలను నివారించే ఓ ప్రోటీను జాడ ఇప్పటికి తెలిసింది. దాని సాయంతో బట్ట తల రాకుండా నివారించడమే కాదు, బట్టతల వచ్చిన వారిలో కూడా తిరిగి జుట్టు మొలిచేలా చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు హార్వర్డ్ పరిశోధకులు. సో...ఇక బీడువారిన భూముల్లో మొలకలు వస్తాయన్న మాట.. అదేనండీ.. మన బట్టతలలపై వెంట్రుకలు మొలుస్తాయి.
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola