Most Dangerous Fugu Fish: ప్రపంచంలో ప్రమాదకరమైన వంటకం... ఎక్కడ కుక్ చేస్తారో తెలుసా?

Continues below advertisement

ఇంతవరకు ప్రపంచంలో ఏది వండాలన్నా ఎలా వండాలో తెలిస్తే చాలు కానీ లైసెన్స్ ఏంటి విడ్డురం కాకపోతేనూ అనుకుంటున్నారా ? ఈ చేపను వండాలంటే మాత్రం వండటం తెలియటం తో పాటు లైసెన్స్ కూడా అవసరం. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వంటకాల్లో ఒకటి జపాన్‌కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’.జపాన్లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. ఈ చేపను వండాలంటే బాగా అనుభవం ఉన్న, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. ఈ చేపలో ఉండే విషాన్ని ‘టెట్రోడోక్సిన్’గా గుర్తించారు. ఈ విషం చేపలో ఏ భాగంలో ఉంటుందో, ఆ భాగాన్ని జాగ్రత్తగా వేరు చేసి దూరంగా పడేస్తారు. చుక్క విషం మిగిలిపోయి వండేసినా దాన్ని తిన్నవారికి నోరు తిమ్మిరెక్కిపోవడం, పక్షవాతం రావడం, ఒక్కోసారి మరణం సంభవించడం కూడా జరుగుతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram