పామును చూసి దేవుడ్ని తల్చుకున్న మహిళ, వదిలేసిన పాము, వీడియో వైరల్
Continues below advertisement
కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భాగమ్మ అనే మహిళ తన పొలంలో నిద్రిస్తూ ఉండగా... అక్కడికి ఓ కోబ్రా వచ్చింది. ఆమెకు దగ్గరగా వెళ్లిన ఆ పాము.... ఒక్కసారిగా పడగవిప్పింది. ఆ మహిళ అప్పుడు భయంతో శ్రీశైలం మల్లన్నస్వామిని తల్చుకుంది. తనను కాపాడాలని వేడుకుంది. కాసేపటి తర్వాత పడగ దించేసిన పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇలా దేవుడ్ని తల్చుకోగానే పాము ఎలాంటి హానీ తలపెట్టకుండానే వెళ్లిపోయిందంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది.
Continues below advertisement