Wayanad LandSlides |వరదల్లో వయనాడ్.... 107కు చేరిన మృతుల సంఖ్య | ABP Desam
Wayanad Landslides shocking Visuvals | కేరళను మరోసారి భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వయనాడ్ జిల్లాలో ఇప్పుడు ప్రకృతి కోపానికి గురైంది. భారీ వర్షం కారణంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కొండ చరియలు విరిగిపడటంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందకుపైగా మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కొండ చరియలు విరిగపడటంతో చాలా మంది తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎంతో మంది బురదలో చిక్కుకున్నారు. ఇంకా ఎంత మంది ఆ వరదలో కొట్టుకుపోయారో లెక్కలేదు. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ఐతే.. వయనాడ్ లో ఇంకా భారీ స్థాయిలో వర్షాలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.