Viral Video Man Does Pushups On Top Of Moving Car: వైరల్ వీడియో చూసి పోలీసుల చర్యలు
Continues below advertisement
హరియాణాలోని గురుగ్రామ్ లో ఓ వ్యక్తి... కారు మీదకు ఎక్కి పుషప్స్ తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకరు కారు నడుపుతుంటే... ఆ వ్యక్తి పైకి ఎక్కి వరుసగా 6 పుషప్స్ తీశాడు. ఇంకో ముగ్గురు కారు కిటికీల్లో నుంచి బయటకు వేలాడుతూ కనిపించారు. పుషప్స్ తీస్తున్న వ్యక్తిని ఎంకరేజ్ చేశారు. వారి కారు వెనుకే మరో కారులో వస్తున్న ఓ వ్యక్తి.... దీన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. హరియాణా పోలీసులను ట్వీట్ చేశాడు. పోలీసులు కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా గుర్తించి.... కేసు నమోదు చేసుకుని నిందితుడికి 6వేల 500 రూపాయల ఫైన్ విధించారు.
Continues below advertisement