Tumkur Police Caught the thief | ప్రాణాలకు తెగించి క్రిమినల్ ను పట్టుకున్న కానిస్టేబుల్
Tumkur Police Caught the thief | స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఎలా ప్రాణాలు తెగించి ఆపాడో చూస్తున్నారు కదా..! ఇక్కడ స్కూటీపై వెళ్తున్న వ్యక్తి పలు కేసుల్లో నిందితుడు.. వెంటపడి పట్టుకున్న వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్..! ఈ ఘటన కర్ణాటకలోని తుమ్‌కూరు ప్రాంతంలో జరిగింది. సుమారు 7 కేసుల్లో మంజునాథ్ నిందితుడుగా ఉన్నాడు. ఐతే పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. ఐతే.. తుమ్‌కూరు ప్రాంతంలో మంజునాథ్ తిరుగుతున్నాడని సమాచరం రావడంతో....కానిస్టేబుల్ లింగయ్య ఆ ప్రాంతానికి వెళ్లాడు. తుమ్‌కోలమ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మంజునాథ్ ను గుర్తుపట్టిన కానిస్టేబుల్ లింగయ్య ఊరికి పట్టుకున్నాడు. ఐతే..పోలీస్ ను చూసి ఆపకుండా స్కూటీని పోనిచ్చాడు మంజూనాథ్. ఐనప్పటికీ.. అతడి కాలర్ పట్టుకుని ప్రాణాలకు తెగించి మరి ఇలా స్కూటీతో పాటు వెళ్లాడు. ఇది చూసిన జనం, అక్కడున్న పోలీసులు వెంటనే రెస్పాండ్ ఐ.. ఆ స్కూటీని ఆపేశారు. అలా.. క్రిమినల్ మంజునాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తతంగం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో... కానిస్టేబుల్ లింగయ్య సాహసాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.