Terrorist Grenade Attack On Army Truck: Jammu Kashmir లో గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనను ఉగ్రదాడిగా సైన్యం తేల్చింది. ట్రక్కుపై గ్రనేడ్లతో దాడి చేసినట్లు నిర్ధరించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు సైన్యం ధ్రువీకరించింది. గాయపడిన మరో జవాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. జవాన్ల మృతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola