Prajwal Revanna Video Release | Pen Drive Case | షాకింగ్ వీడియో విడుదల చేసిన ప్రజ్వల్ రేవణ్ణ | ABP

Prajwal Revanna Video Release | Pen Drive Case | లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరుకానున్నారు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. చాలా మంది మహిళలు రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కొంతకాలం క్రితం అతని అనేక సెక్స్ టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు.ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాట్లాడుతూ.. తప్పుగా భావించవద్దు.. మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరు అవుతానని.. విచారణకు సహకరిస్తానని చెప్పారు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాపై ఈ కేసులన్నీ తప్పుడు కేసులు. నేను చట్టాన్ని నమ్ముతాను'' అన్నారు.  హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (33) జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు. రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలతో ఏప్రిల్ 26న దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ జేడీఎస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola