PM Modi Ayodhya Deeksha: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య ప్రాణప్రతిష్ఠ పండుగను పురస్కరించుకుని 11 రోజుల పాటు ప్రత్యేక దీక్షను ఆచరించిన ప్రధాని నరేంద్ర మోదీ... నేటితో దాన్ని విరమించారు. అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేదిక వద్దకు మోదీ చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది ముందు తన దీక్షను మోదీ విరమించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి, రాములవారి ప్రసాదం మోదీ చేత తాగించి ఉపవాస దీక్షను విరమింపచేశారు.