PM Modi MP Oath Taking: పార్లమెంటులో ఎంపీగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం

PM Modi MP Oath Taking: 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

18 లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సహా ఇతర ఎంపీలతో నూతన లోక్ సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేస్తారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. అంతకు ముందు ప్రొటెం స్పీకర్‌తో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ హాజరయ్యారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola