PM Modi Ram Lalla Ayodhya: శ్రీరాముడ్ని ప్రధాని మోదీ క్షమాపణ ఎందుకు కోరారు..?
Continues below advertisement
అయోధ్యలో ( Ayodhya Ram Mandir ) ప్రాణ ప్రతిష్ఠ ( Praana Prathishta ) క్రతువు ముగిసిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) కీలక ప్రసంగం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో శ్రీరాముడికి ( Jai Shree Ram ) క్షమాపణలు కూడా చెప్పారు.
Continues below advertisement