Low Gold Prices In Bhutan: అంత తక్కువ ధరకే బంగారం దొరకడం వెనుక కారణం ఏంటి..?
ప్రపంచంలో బంగారం చీప్ గా దొరికేది దుబాయ్ లోనే అని సాధారణంగా అంతా అనుకుంటారు. కానీ కాదు. భూటాన్ లో. దాని వెనుక ఓ ఆసక్తికర స్టోరీ కూడా ఉంది. ఇవాళ్టి రోజున ప్రతి పది గ్రాముల బంగారానికి ఇండియాతో పోలిస్తే భూటాన్ లో సుమారు 17 వేల రూపాయలు తగ్గుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఇండియాలో 61 వేలు ఉంటే, దుబాయ్ లో 53 వేలు, భూటాన్ లో కేవలం 43 వేలకే లభిస్తుంది. అసలు ఇంత తక్కువ ధరకు ఎందుకు? భూటాన్ లో ఏమైనా సర్ ప్లస్ బంగారం ఉందా? కాదు. కారణం అది కాదు. భారతీయ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికే ఇలా.