Karnataka CM Siddaramaiah Starts Shakti Yojana: ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన సీఎం

ఇటీవలే కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.... ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు పక్కా స్కీముల్లో మొదటిది ఇవాళ ప్రారంభించింది. అదే శక్తి యోజన. ఈ పథకం కింద KSRTC, BMTC పరిధిలోని అన్ని బస్సుల్లోనూ మహిళలకు ప్రయాణం ఉచితం. ఈ పథకాన్ని ఇవాళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. బస్సులో ఉచిత పాసులు పంపిణీ చేశారు. మిగతా నాలుగు పథకాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. శక్తి యోజన పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola