Breaking News : Himachal Pradesh Election Results : 40 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ | ABP Desam
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తొలుత ఫలితాలు కాంగ్రెస్ - బీజేపీకి పోటాపోటీగా వస్తుండటంతో హంగ్ వస్తుందేమోననే అనుమానం నెలకొంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ దాదాపు పది నుంచి పదిహేను అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా 1000 కంటే తక్కువే ఉందని సమాచారం. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.