Bengaluru Hindustan Aeronautics Space Museum: బెంగళూరులో ఆకట్టుకుంటున్న మ్యూజియం
బెంగుళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ స్పేస్ మ్యూజియం (HAL)ను చూస్తే యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను బొమ్మల కొలువులా అమర్చారా అనిపిస్తుంది. 2001లో స్థాపించిన HAL ఏరోస్పేస్ మ్యూజియంలో పాతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకూ భారత సైన్యం వాడుతున్న వార్ ఫ్లయిట్స్, హెలికాప్టర్లు, రాకెట్ విడిభాగాలను ప్రదర్శన కోసం ఉంచారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే HAL ఏరోస్పేస్ మ్యూజియం ఎంట్రీ ఫీ పెద్దలు ఒక్కొక్కరికి 50 రూపాయలు మాత్రమే. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకూ ఈ మ్యూజియంను హ్యాపీగా చూసేయ్యొచ్చు.