Arunachal Pradesh Assembly Election Results 2024: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఫలితాలు విడుదల

Continues below advertisement

2024 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో బీజేపీ 46 స్థానాలు గెలుచుకుంది. వీటిలో 10 సీట్లలో అసలు బీజేపీకి పోటీనే లేదు. అభ్యర్థులు కూడా నిలబడలేదు. దీంతో ఆ పదిస్థానాలు బీజేపీకి ఏకగ్రీవమయ్యాయి.

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగనుంది. అక్కడ మొత్తం 60 స్థానాలు ఉండగా.. 31 స్థానాలు గెల్చుకుంటే అధికారం చేజిక్కించుకోవచ్చు. అలాంటిది పది స్థానాలు ఎన్నికల ముందే అక్కడ ఏకగ్రీవం అయ్యాయి. నేడు జరుగుతున్న మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపులో మెజార్టీ మార్కుకు అవసరమైన 31 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధిగమించింది. ఏకగ్రీవమైన 10 స్థానాలు కలుపుకొని కనీసం 33 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మరో 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీనే జోరు ప్రదర్శిస్తోంది.

అరుణాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో బీజేపీ 46 స్థానాలు గెలుచుకుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram