Dengue Fever: డెంగ్యూ రాకుండా ఏం చేయాలి? డాక్టర్స్ ఏమంటున్నారు ?
డెంగ్యూ వ్యాపింపజేసే దోమలు ఎక్కువగా సాయంత్రం ఉంటాయి. చిన్నపిల్లలని సాయంత్రం సమయంలో బయట తిప్పకపోతే మంచిది. ఒక వేళ తీసుకెళ్లాల్సి వచ్చినా కూడా కాళ్ళు, చేతులు మొత్తం కవర్ అయ్యేలా బట్టలు వేయాలి. పిల్లలకు జ్వరమొస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించాలి. లాస్ట్ ఇయర్ కొవిడ్ వల్ల ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యాం అందుకే డెంగ్యూ కేసులు ఎక్కువగా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ వాడటం వల్ల కూడా దోమ కాట్లను తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఈ విషయంపై డాక్టర్లు ఏమంటున్నారు.?