Omicron Movie : సినిమా గురించి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా.| ABP Desam
Continues below advertisement
‘ఒమిక్రాన్’ అనేది వైరస్ కాదంట. 1963లో విడుదలైన చిత్రమట. మరి, వైరస్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రపంచమంతా ఈ పేరునే కలవరిస్తోంది. ఎందుకంటే.. Covid-19 నుంచి పుట్టిన కొత్త వైరస్. ఇండియాలో మారణకాండ సృష్టించిన డెల్టా వేరియెంట్ కంటే ప్రమాదకరమైన ఈ వైరస్ ఇప్పటికే వివిధ దేశాల్లో తన ఉనికిని చాటుతోంది. తాజాగా ఇండియాలోకి కూడా ప్రవేశించిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, ఇది వేరియెంట్ ప్రమాదకరమైనదని కొందరు, అంత ప్రమాదకరమైనది కాదని మరికొందరు గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం ఈ వేరియెంట్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తోంది. డెల్టా వేరియెంట్ తరహాలోనే ఇది ముప్పుతిప్పలు పెడుతుందని, దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Continues below advertisement