Shreya Muralidhar: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి.| ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆమె వయసు 27 సంవత్సరాలే. చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రియా మురళీధర్ యాంకర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ కూడా! ఆమె స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డికపూల్. నటన అంటే ఆమెకు చాలా ఇష్టం, అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా,వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు. టీవీ హోస్ట్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లి చూపులు' రియాలిటీ షోలో శ్రియ ఓ కంటెస్టెంట్. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. 'బ్యూటీ అండ్ ద బాస్' సీజన్ 2లో ఓ పాత్ర చేశారు. 'వాట్ ద ఫన్' యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు.