Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?

Continues below advertisement

‘పొదరిల్లు’ సీరియల్‌లో తన హోమ్లీ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది హీరోయిన్ కృతిక ఉమాశంకర్. ఈ సీరియల్‌లో 'మహాలక్ష్మి'గా నటిస్తూ బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న కృతిక పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా బెంగళూరులోనే. చదువు పూర్తి కాగానే మోడలింగ్, కన్నడ టెలివిజన్ పరిశ్రమ ద్వారా నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత స్టార్ మా లో వచ్చిన 'మగువ ఓ మగువా' సీరియల్‌లో 'సింధూర' క్యారెక్టర్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. 

ఆ సీరియల్ నడుస్తుండగానే ‘పొదరిల్లు’లో మెయిన్ లీడ్ ఛాన్స్ అందుకుంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ, తెలుగు డైలాగ్స్ ఎక్స్‌ప్రెషన్స్‌ను పర్ఫెక్ట్‌గా పలికేందుకు కృతిక చాలా హార్డ్ వర్క్ చేసింది. ప్రస్తుతం షూటింగ్స్ కోసం హైదరాబాద్, బెంగళూరుల మధ్య ట్రావెల్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కృతిక.. ట్రెడిషనల్ లుక్స్, సెట్స్ లో చేసే ఫన్నీ రీల్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

గ్లామర్ పాత్రల కంటే కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రిఫరెన్స్ ఇచ్చే కృతిక రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. లీడ్ రోల్స్ చేస్తూ ఫుల్ డిమాండ్‌లో ఉన్నందుకు గానూ, ఆమెకు రోజుకు సుమారు 15,000 నుండి 20,000 వరకు పారితోషికం అందుతుందని ఇండస్ట్రీ టాక్. మరి పొదరిల్లు సీరియల్‌లో మహాలక్ష్మి యాక్టింగ్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్  చేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola