MAA: ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా.. కండీషన్స్ అప్లై!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా రాజీనామా చేశారు. సంస్థ ముందుకు వెళ్లాలంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండాలన్నారు. అలాంటి పరిస్థితి లేదని .. అందుకే తాము రాజీనామా చేస్తున్నామన్నారు. మంచు విష్ణు తనకు ఇష్టం వచ్చిన వారిని తాము రాజీనామా చేసిన స్థానాల్లో నియమించుకుని పరిపాలన చేయాలన్నారు. ఎన్నికల హామీలుగా పెద్ద పెద్ద మాటలు చెప్పారని వాటన్నింటినీ రెండేళ్లలో అమలు చేయాలన్నారు. అమలు చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తమది ప్రశ్నించే నైజమని.. అలాంటి మేము టీంలో ఉంటే గొడవలు జరుగుతాయని అందుకే రాజీనామా చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు.