Actor Nani: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్యాం సింగరాయ్ టీమ్

Continues below advertisement

టీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇందుకోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తాజాగా శ్యాం సింగరాయ్ మూవీ టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు అయ్యారు. జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జీహెచ్ఎంసీ పార్కులో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ తమ వంతుగా కొన్ని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరు కొన్ని మొక్కలు నాటాలని, వాటికి నీళ్లు పోసి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మిగ్ లాంటి వాతావరణ సమస్య అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని శ్యాం సింగరాయ్ టీమ్ చెప్పింది. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతలు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు. ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram