Vishwak Sen Speech in Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ లో విశ్వక్ సేన్ | ABP

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యారు. నార్మల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తనకు ఇప్పుడు దక్కుతున్న ఆదరణ అస్సలు ఊహించలేనిదన్నారు. నందమూరి బాలకృష్ణ తనపై చూపించే ప్రేమ వెలకట్టలేనిదన్నాడు విశ్వక్ సేన్. యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన మాస్ ఫార్ములాను ఫాలో అవుతూ నటించిన సినిమానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ నుంచి పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌కు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో బిజీ అయిపోయింది. అందులో భాగంగానే విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయపెట్టాడు. దీంట్లో తను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో చెప్పాడు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola