Vijay Sethupathi Heart Touching Words | విజయ్ సేతుపతి ఎవరిని ఎక్కువ మిస్ అవుతున్నారు? | ABP Desam

Continues below advertisement

"మీ లైఫ్ లో మీరు ఏం మిస్ అవుతున్నారు?" అని సుహాస్ అడిగిన ప్ర‌శ్న‌కి విజ‌య్ సేతుప‌తి ఆలోచింప‌జేసే స‌మాధానం ఇచ్చాడు. “న‌న్ను నేను మిస్ అవుతున్నాను. అప్ప‌ట్లో ఒక అబ్బాయి ఉండేవాడు చాలా అమ్మాయికుడు. ఎలాంటి క‌ల‌లు లేకుండా ఉండేవాడు. జీవితంలో ఏం చేయ‌బోతున్నాడో తెలియ‌దు. కాలేజీలో ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు రెండో ఏడాది సిల‌బ‌స్ ఏంటో తెలీదు. స్పోర్ట్స్ లో, చ‌దువులో రెండు విష‌యాల్లో వెన‌క‌బడి ఉంటాడు. క‌నీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. చాలా సిగ్గు. అందుకే క‌నీసం అమ్మాయిల‌తో మాట్లాడేవాడు  కాదు. లైఫ్ లో సెటిలవ్వాలి అనుకునేవాడు. కానీ ఎలా సెటిలవ్వాలో తెలీదు. గోల్ మాత్రం ఒక్క‌టే.. పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డాలి. అంత‌టి అమాయ‌కుడు ఆ వ్య‌క్తి. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు నేనే. న‌న్ను నేను చాలా మిస్ అవుతున్నాను”  అంటూ త‌న గురించి చెప్పారు విజ‌య్ సేతుప‌తి. విజ‌య్ సేతుప‌తికి స‌క్సెస్ అంత ఈజీగా రాలేదు. ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఎన్నో ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. స్వ‌యం కృషితో పైకి వ‌చ్చిన వ్య‌క్తి ఆయ‌న‌. గ‌తంలో క్యాషియ‌ర్ గా, సేల్స్ మెన్, ఫోన్ బూత్ ఆప‌రేట్ గా చేశాడు ఆయ‌న‌.  డిగ్రీ త‌ర్వాత హోల్ సేల్ సిమెంట్ బిజినెస్ లో చేరి, అక్క‌డ నుంచి దుబాయ్ వెళ్లారు. అక్క‌డ ప‌ని న‌చ్చ‌క ఇండియాకి తిరిగి వ‌చ్చేశాడు. 2003లో ఆయ‌న పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ మొద‌లుపెట్టాడు. ఆ త‌ర్వాత మార్కెటింగ్ కంపెనీలో కూడా ప‌నిచేశాడు. “ ఒక వేళ నా బిజినెస్ బాగా సాగి ఉంటే నేను సినిమా యాక్ట‌ర్ అయ్యేవాడినే కాదు” అని ఫోర్బ్స్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు విజ‌య్ సేతుప‌తి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram