Vijay Sethupathi on Life | లైఫ్ గురించి విజయ్ సేతుపతి ఫిలాసఫీ ఇదే | ABP Desam

Did Vijay Sethupathi reject the villain role in Pushpa?: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. అందుకు కారణం... ఆయన ఓ తరహా పాత్రలకు పరిమితం కాని నటుడు. హీరోగా నటిస్తారు. విలన్ రోల్స్ కూడా చేస్తారు. కథలో కీలకమైన పాత్రల్లోనూ మెరుస్తారు. తెలుగులో 'ఉప్పెన', తమిళ 'విక్రమ్', రీసెంట్ హిందీ సినిమా 'జవాన్'లో ఆయన విలన్ రోల్స్ చేశారు. అయితే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియన్ హిట్ 'పుష్ప' మూవీలో విలన్ క్యారెక్టర్ ఆయన రిజెక్ట్ చేశారని ప్రచారం జరిగింది. దానిపై ఆయన తాజాగా స్పందించారు.

నేను రిజెక్ట్ చేయలేదు కానీ...
అన్నిసార్లూ నిజం చెప్పకూడదు!
విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజ'. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ లభించింది. దాంతో సోమవారం హైదరాబాద్ సీటీలో థాంక్యూ మీట్ (Maharaja movie thank you meet) నిర్వహించింది చిత్ర బృందం. అందులో విజయ్ సేతుపతికి 'పుష్ప 2' గురించి ప్రశ్న ఎదురైంది.

'మీరు 'పుష్ప'లో రోల్ రిజెక్ట్ చేశారని టాక్ అయితే నడిచింది. నిజమేనా?' అని విజయ్ సేతుపతిని టాలీవుడ్ రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ''నేను రిజెక్ట్ చేయలేదు సార్! కానీ, అన్ని ప్రదేశాల్లో అన్నిసార్లూ నిజం చెప్పకూడదు. అది జీవితానికి బాగోదు సార్! కొన్నిసార్లు అబద్ధం చెప్పడం మంచిది సార్'' అని విజయ్ సేతుపతి సమాధానం ఇచ్చారు. దాంతో ఆయనకు 'పుష్ప'లో అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని, కానీ చేయలేదని ఇప్పుడు అబద్ధం చెప్పారని ప్రేక్షకులు అనుకోవాల్సి వస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola