Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Continues below advertisement

ప్రముఖ తెలుగు సీరియల్ 'జయం'లో హీరోయిన్ గా అలరిస్తోంది కన్నడ బ్యూటీ వర్షిణి గౌడ అందరి ప్రశంశలు అందుకుంటుంది. బెంగళూరులో పుట్టి పెరిగిన వర్షిణి, ఇంటర్‌లోనే మోడలింగ్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ను గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. మిత్రుల ప్రోత్సాహంతో ఆడిషన్స్ ఇచ్చి కన్నడలో ‘బృందావన’, ‘అగ్నిసాక్షి’ వంటి హిట్ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. 

ప్రస్తుతం 'జయం' సీరియల్‌లో 'గంగ' అనే అమాయకమైన, ఎమోషనల్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ, తెలుగు స్పష్టంగా నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెపుతుంది. 

ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పటికీ, రోజుకు 10,000 నుంచి 18,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. దీనికి తోడు సోషల్ మీడియా ప్రమోషన్లు, మోడలింగ్ ద్వారా కూడా ఆదాయం పొందుతోంది. షూటింగ్ లొకేషన్ విశేషాలు, రీల్స్ పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే సౌత్ బుల్లితెరపై నటిగా తనదైన ముద్ర వేస్తూ వర్షిణి దూసుకుపోతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola