TSRTC: అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
టీఎస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచిన కారణంగా.. హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థలకు లీగల్ నోటీస్ లు పంపించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఎండీ.. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని.. అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.