The Kalki Chronicles | Ep 1 Full Interview | Amitabh, Kamal Haasan తో కలిసి ప్రభాస్, దీపికా సందడి

Kalki 2898AD సినిమా ఈనెల 27న విడుదలకు సిద్ధం అవుతోంది. Nag Ashwin డైరెక్షన్ లో వస్తున్న ఇండియాలోనే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ సంగతుల గురించి Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone చెప్పిన ఎన్నో విషయాలు ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో. ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. కల్కి 2898 AD మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్ ఒపెన్‌ అయ్యాయి. ఇప్పటికే నార్త్‌ అమెరికాలో ఆడ్వాన్స్‌ బుకింగ్స్ ఒపెన్ అవ్వగా అవి భారీగా అమ్ముడుపోతున్నాయి. ప్రీ సేల్‌లో కల్కి భారీగా బిజినెస్‌ చేస్తుంది. దీంతో ఇండియాలో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్‌ బుకింగ్స్ ఒపెన్‌ అవుతాయా? అని ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ కూడా క్యూరియాసిటిగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బుక్‌ మై షోలో అడ్వాన్స్‌ బుకింగ్స్ ఒపెన్‌ అయ్యాయి.ఏపీ ప్రభుత్వం నేడు కల్కి టికెట్లు రేట్లు భారీ పెంపునకు అనుమతి ఇవ్వడంతో వెంటనే అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్స్ ఒపెన్‌ కాగా.. తెలంగాణలో కాస్తా ఆలస్యంగా ఒపెన్‌ అయ్యాయి. ఇక కాసేపటి క్రితం టికెట్స్‌ ఒపెన్‌గా భారీగా రెస్పాన్స్‌ వస్తుంది. టికెట్స్‌ క్షణాల్లో వేలల్లో అమ్ముడయ్యాయి. గంట వ్యవధిలోనే 59 వేల నుంచి 60 వేల వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. అప్పుడే థియేటర్లో అడ్వాన్స్‌ బుకింగ్స్ లో హౌజ్‌ఫుల్‌ చూపిస్తున్నాయి. దీంతో కల్కి మూవీకి ఏ రేంజ్‌ బజ్‌ ఉందో ఈ అడ్వాన్స్‌ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. చూస్తుంటే  కల్కి ఫస్ట్‌ డే రికార్డు స్థాయిలో ఒపెనింగ్స్‌ ఇచ్చేలా ఉంది. ఫస్ట్‌ డే ఒపెనింగ్స్‌లో ఇప్పటి వరకు ఉన్న సినిమాల రికార్డును ప్రభాస్‌ కల్కితో తుడిపెట్టాలే కనిపిస్తున్నాడు.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola