SSMB29 Shoot in Masai Mara | కెన్యా మినిస్టర్ తో జక్కన్న

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమా SSMB29. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మూడవ షెడ్యూల్ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో జరగనుందట. రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో కెన్యా నుంచి ఫోటోలు షేర్ చేసింది. తాజాగా రాజమౌళి కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. జక్కన్నతో పాటు నిర్మాత KL నారాయణ, SS కార్తికేయతో పాటు అక్కడి భారత ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాజమౌళితో దిగిన ఫోటోలను కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజమౌళిని పొగిడారు. వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫీల్ మేకర్ అంటూ రాసుకొచ్చారు. ఈస్ట్ ఆఫ్రికా అంతా పర్యటించి.. రాజమౌళి టీమ్‌ కెన్యాను సెలెక్ట్ చేసుకున్నారు. మసాయి మరా నుంచి నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్‌ చేస్తోంది అంటూ తన పోస్ట్ లో చెప్పారు కెన్యా మినిస్టర్. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. కెన్యాలో షూటింగ్, సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారంటూ ఫ్యాన్స్ కు కూడా మంచి అప్డేట్ ఇచ్చారు కెన్యా ఫారిన్ మినిస్టర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola