SS Rajamouli National Awards for RRR : బాహుబలి, RRR మించిన సినిమాలు తీస్తున్నారా.? | ABP Desam
ఓ సినిమా హిట్ అయ్యింది లేదు ఫ్లాప్ అయ్యింది ఎలా డిసైడ్ చేస్తాం. కలెక్షన్స్ అండ్ ప్రజల ఆదరాభిమానాలు అంతే కదా. హిట్ సినిమాలు ప్రతీవాటికి అవార్డులు రాకపోవచ్చు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. అటు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్రజల్లో విపరీతమైన ఆదరాభిమానాలు సంపాదించుకుంటాయి. అవార్డులు కొల్లగొడతాయి. సరిగ్గా ఇలాంటి మీటర్ లో సినిమాలు తీసే డైరెక్టరే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.