SS Rajamouli Mahesh New Movie Story : బాబు రేంజ్ కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవటం పక్కా
Continues below advertisement
Globe Trotting Action Adventure...ఎప్పుడైతే ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను తీయబోతున్న సినిమా ఈ లైన్ లో ఉంటుందని చెప్పారో అప్పటినుంచి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అనే పదానికి అర్థం వెతకటం దగ్గర ఆ లైన్ లో వచ్చిన సినిమాలు ఏంటీ..హాలీవుడ్ లో ప్రస్తుతం ఆ లైన్ లో ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుందని మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు సినిమా అంటే పిచ్చ అభిమానం ప్రతీవాడు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ అయితే జక్కన్న- మహేష్ బాబు సినిమా లైన్ ఏంటనేది సస్పెన్స్ కానీ రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ కు అవకాశం ఉన్న ట్రెండింగ్ సినిమా లైన్స్ ఏంటో ఓ సారి ఊహించే ప్రయత్నం చేద్దాం.
Continues below advertisement