Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP Desam

శంకర్, మణిరత్నం. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్స్. ఎన్నో రికార్డులు, వసూళ్లు. డైరెక్టర్స్‌కి స్టార్‌డమ్ తీసుకొచ్చారు ఈ ఇద్దరు. కానీ..కొంత కాలంగా సరైన హిట్ కోసం ఈ ఇద్దరు డైరెక్టర్‌లు చాలా కష్టపడుతున్నారు. శంకర్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో బ్లాక్‌బస్టర్ అయింది. శంకర్ స్టామినాని రుచి చూపించింది ఈ విజువల్ వండర్. కానీ..ఆ తరవాత శంకర్‌కి ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. రోబో 2.0 వచ్చినా...గ్రాఫిక్స్ జిమ్మిక్ తప్ప కథలో బలం లేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. ఆ తరవాత వచ్చిన ఇండియన్ 2 సినిమాతో అయితే..శంకర్‌ దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు ఈ సినిమా తీసింది ఆయనేనా అన్న డిబేట్ కూడా జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో గేమ్‌ ఛేంజర్ సినిమా తీసి రిలీజ్‌కి రెడీ చేశాడు శంకర్. ఈ మధ్యే టీజర్‌ విడుదలైంది. వావ్ అనిపించే ఫ్యాక్టర్ లేదని కొందరు, చాలా బాగుందని మరి కొందరు అంటున్నారు. సినిమాలో సర్‌ప్రైజ్‌లను ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని కావాలనే ఇలా టీజర్‌ని కట్ చేయించారన్నది మరో వాదన. ఎలా చూసుకున్నా..గేమ్ ఛేంజర్‌ సినిమా శంకర్ కెరీర్‌లో నిజంగానే గేమ్ ఛేంజర్ అవుతుందా అన్నది చూడాలి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola