RRR: ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి రెండో పాట విడుదల.. దుమ్ములేపిన చరణ్- తారక్ డ్యాన్స్
బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాలో మొదటి పాటను విడుదల చేయగా.. రీసెంట్ గా సినిమాలో రెండో పాటను విడుదల చేశారు. 'పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు..' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఐదు భాషల్లో సాంగ్ ను రిలీజ్ చేశారు. చిత్రబృందం చెప్పినట్లుగానే ఈ బ్లాస్టింగ్ బీట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ స్టెప్పులు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇద్దరూ తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు.