Samantha Special Song in Peddi Movie | పెద్దిలో సమంత స్పెషల్ సాంగ్‌ ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ "పెద్ది". ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రామ్ చరణ్ మాస్ లుక్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయినా తాజాగా ఈ మూవీకి సంబందించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జోడీ... మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే ఈ సినిమాలో సమంత కూడా నటిస్తున్నారనే వార్తలు హల్చల్ చేసాయి. కానీ మూవీ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పవర్ ప్యాకెడ్ మాస్ ఎంటర్టైనర్ గా పెద్ది సినిమా ఉండబోతుందని టీజర్ చుస్తేనే తెలుస్తుంది. ఇక అలాంటి సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ట్రెండ్ సెట్ చేసిన సమంత మరి పెద్ది సినిమాలో సాంగ్ చేస్తుందో లేదో చూడాలి.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola