Rashmika Mandanna Promotions For Atal Setu | అటల్ సేతుని ప్రమోట్ చేస్తున్న రష్మిక | ABP Desam

పాలిటిక్స్‌కి కూడా గ్లామర్ అవసరమే. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయిస్తాయి అనేక రాజకీయ పార్టీలు. అవసరమైతే సినీ నటులకు టికెట్‌ ఇచ్చి బరిలోకి కూడా దింపుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్నికల రంగంలోకి దిగారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బీజేపీకి ఎప్పటి నుంచో అనుకూలంగా ఉంటున్నారామె. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు నుంచే మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు. రాజకీయాలపై తనకున్న ఆసక్తిపైనా హింట్స్ ఇచ్చారు. ఇదంతా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సంగతి. దక్షిణ భారతదేశంలో కూడా ఉనికిని నిలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ ఇక్కడి స్టార్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్నని రంగంలోకి దింపింది. ఎన్నికల కోసం ఆమెతో ఓ ప్రత్యేకమైన వీడియో షూట్ చేయించారు. భారత్‌లోనే అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ సేతుని రష్మికతో ప్రమోట్ చేయించారు. దీంతో కంగనా లాగే రష్మిక మందన్న కూడా బీజేపీతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అన్న గుసగుసలూ మొదలయ్యాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola