విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక
విజయ్ దేవర కొండ, రష్మిక మరోసారి సోషల్ మీడియాకి కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. పుష్ప 2 ఈవెంట్‌లో రష్మిక ఇన్‌డైరెక్ట్‌గానే విజయ్‌తో ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయింది. "ఇది అందరికీ తెలిసిన విషయమేగా" అని చాలా కూల్‌గా చెప్పింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ట్విటర్‌లో అయితే..రష్మిక మందన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు పుష్ప ఈవెంట్ మొత్తంలో ఇదే హైలైట్ అయింది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ చాలా ఏళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఫెస్టివల్‌కీ రష్మిక...విజయ్ ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఫ్యాన్స్‌లో ఎక్కడి లేని ఇంట్రెస్ట్ పెరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవచ్చుగా..లైట్ తీస్కోండి బాస్ అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ...విజయ్, రష్మిక ఫ్యాన్స్ మాత్రం అసలు ఏ మాత్రం వేరే ఆలోచనే చేయడం లేదు. వాళ్లిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిసి కనిపిస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ మధ్య విజయ్ దేవర కొండ ఓ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోని షేర్ చేశాడు. రష్మిక కూడా ఇలాంటి ఫొటోనే పోస్ట్ చేసింది. ఇద్దరూ ఒకే దగ్గరున్నారంటూ మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియాలో అదే పనిగా పోస్ట్‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ ఒకే చోట కనిపించారు.