Rashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

పుష్ప 2 ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్‌తో పాటు అందాల తార రష్మిక మందన్నా హాజరయ్యారు. పుష్పరాజ్ పాత్రతో సమానంగా ప్రేక్షకుల ప్రేమను అందుకున్న రష్మిక, శ్రీవల్లి పాత్ర ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈ ఈవెంట్‌లో ఆమె సినీ ప్రస్థానాన్ని ప్రొమో రూపంలో ప్రదర్శించారు. ఆ ప్రోమో చూసి రష్మిక భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తెచ్చుకుని, తమపై అభిమానులు చూపిస్తున్న అమిత ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప సినిమాతో తన ప్రయాణం మొదలైన తొలిరోజు, మొదటి షాట్ ఇప్పటికీ తనకు గుర్తుందని, ఆ అనుభవాలు జీవితాంతం నిలిచిపోతాయని ఆమె భావోద్వేగంతో అన్నారు.  ఈ వేడుక రష్మిక అభిమానులకు మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది. తన పాత్రకు, నటనకు వచ్చిన ఆదరణ తనకు చాలా విలువైనదని పేర్కొంటూ, పుష్ప జట్టుకు, దర్శకుడు సుకుమార్‌కు, సహనటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ పుష్ప 2పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola