Rashmika Mandanna And Anand Devarkonda Hilarious Fun | రౌడీ బాయ్ ఇష్టమంటూ డైరెక్ట్ గా చెప్పిన రష్మిక

Gam Gam Ganesha Pre Release Event లో పాల్గొన్న రష్మిక...తను విజయ దేవరకొండ ఫ్యామిలీలో భాగమైనట్లు స్పష్టం చేసింది. ఆనంద్ దేవరకొండ అడిగిన క్వశ్చన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ర‌ష్మిక ఆనంద్ తో క‌లిసి డ్యాన్స్ చేశారు. చాలా సందడి చేశారు. ఇక ఆ త‌ర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. "ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక ప‌ర్స‌న్ ఉంటాడు. వాళ్ల మీద మ‌నం ఆధార‌ప‌డి ఉంటాం. అమ్మైనా, నాన్నైనా, పార్ట‌న‌ర్ అలా ఒక‌రు క‌చ్చితంగా ఉంటారు. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక అది నాకు బాగా అర్థం అయ్యింది. ఇక ఫ్యామిలీలో ఒక స్ట్రాంగ్ పిల్ల‌ర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఆనంద్ అంటే.. నాకు బ్ర‌ద‌ర్ లాగా. నేను ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రి మీద ఆధార‌ప‌డి ఉంటాను. ఆనంద్‌కు తెలీదు.. నేను అత‌ని మీద చాలా ఆధార‌ప‌డ‌తాను. ఈ సినిమా హిట్ అయితే ఆనంద్ ముఖం మీద న‌వ్వు ఉంటుంది. అందుకే ఆయ‌న ముఖం మీద న‌వ్వు ఉండాలి. ఈ సినిమా హిట్ అవ్వాల‌ని అనుకుంటున్నాను. పాట‌లు చాలా న‌చ్చాయి ఎంజాయ్ చేశాను. ఇక్క‌డే కాదు.. ఇంట్లో కూడా పాట‌లు విని ప్రాక్టీస్ చేశాను" అని చెప్పారు ర‌ష్మిక‌. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola