Ram Charan Participaes in Unstoppable 4 | బాలయ్య, రామ్ చరణ్ సందడిపై భారీగా అంచనాలు

Continues below advertisement

ఈ సంక్రాంతి సీజన్‌కి సందడి చేయనున్న సినిమాల్లో బాలక్రిష్ణ సినిమా డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పోటీ పడబోతున్నారు. ఇలాంటి సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు హీరోలు ఒకే వేదికపై మెరవబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 షోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 31న జరుగుతుంది. రామ్ చరణ్ తో పాటుగా ప్రొడ్యుసర్ దిల్ రాజు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారు. దీంతో బోలెడు ఆసక్తికరమైన ముచ్చట్లు ఇందులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీదెంతో క్యూట్ ఫ్యామిలీ అని బాలకృష్ణ అనడం లాంటివి కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పరస్పరం తలపడుతున్న వేళ ఈ కాంబో మరింత స్పెషల్ గా మారింది. పైగా ఈ అన్ స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుందా అని కూడా భావిస్తున్నారు. జనవరి 10 గేమ్ ఛేంజర్ రానుండగా, జనవరి 12 డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. వీటితో పాటు 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం ఉంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram