Ram Charan Madame Tussauds | లండన్ లో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైన‌పు విగ్ర‌హం ఆవిష్కరించారు. చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసారు. 


మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. రామ్ చరణ్ పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ విగహాన్ని కూడా ఏర్పాటు చేసారు. టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. చరణ్ - రైమ్ ఇద్దరూ తమ మైనపు బొమ్మల పక్కన సోఫాలో కూర్చొని ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు ఉపాసన, కూతురు కీలను కారా, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా పాల్గొన్నారు. 

అయితే ఈ వేడుకకు హాజరవడానికి మెగా ఫ్యామిలీ లండన్ వెళ్ళింది. ఎయిర్ పోర్ట్ లోనే రామ్ చరణ్ కు ఘన స్వగతం పలికారు మెగా అభిమానులు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola