Ram Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP Desam
కడపలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాను సినీ నటుడు రామ్ చరణ్ దర్శించుకున్నారు. ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండి ఇలా కడప దర్గాను దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్గాలో ముస్లిం మత పెద్దలు రామ్ చరణ్ వెంట ఉండి.. దర్గా ప్రాశస్త్యాన్ని వివరించారు. దర్శనం అనంతరం ఓ ప్రత్యేకమైన సింహాసనంపై రామ్ చరణ్ ను కూర్చోబెట్టారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా సోమవారం 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు రామ్‌చరణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరు అయ్యారు. ముషాయిరా గజల్ ఈవెంట్‌కు హాజరవుతానని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు రామ్‌చరణ్ మాటిచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. ఆ మాటకు కట్టుబడే రామ్ చరణ్.. కడప దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు జరిగిన దర్గా ప్రత్యేక ప్రార్ధనల్లో రామ్ చరణ్ పాల్గొన్నారు. రామ్ చఱణ్ తో పాటు డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఉన్నారు.