RajKummar Jyothika With Visually Impaired Community | కళ్లు లేకున్నా అందమైన ప్రపంచం వాళ్లది | ABP Desam
టీ సిరీస్ ప్రొడక్షన్ లో రాజ్ కుమార్ రావు హీరోగా, జ్యోతిక కీలకపాత్రలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం శ్రీకాంత్. తెలుగు వ్యాపారవేత్త, అంధుడు అయిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించి ఎదిగిన విధానం..ఆ స్ఫూర్తిదాయక జీవితాన్ని సినిమాగా తీర్చిదిద్దారు. తెరపై శ్రీకాంత్ గా రాజ్ కుమార్ రావ్ నటించగా..శ్రీకాంత్ టీచర్ గా జ్యోతిక నటిస్తున్నారు. ఈ సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విజువల్లీ ఇంపెయిర్డ్ కమ్యూనిటీతో ఓ రోజు గడిపింది చిత్రబృందం.