Pushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

Continues below advertisement

   డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా 'పుష్ప 2' బెనిఫిట్ షోలు పడతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర బృందం జీవో తెచ్చుకుంది. బెనిఫిట్ షో వేయడం ముఖ్యం కాదు... టికెట్ రేటు గురించి వచ్చిన జీవో ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.  డిసెంబర్ 4న రాత్రి వేసే 'పుష్ప 2' షోలకు అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్ మీద 800 రూపాయలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'పుష్ప 2' బెనిఫిట్ షో రేటు 1100కు పైగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. తెలంగాణలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి రోజు 5 ఆటలు వేసుకోవడానికి అనుమతి ఉంది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా కోసం మరో రెండు ఆటలు అదనంగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఉదయం ఒంటిగంటకు ఒక షో, అలాగే తెల్లవారు జామున 4 గంటలకు ఒక షో వేసుకోవచ్చు. ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 200 టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ జీవో డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram