Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desam

Continues below advertisement

అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దేశమంతటా ఒకటే బజ్. ఓ తెలుగు బేస్డ్ సినిమాకు జాతీయ స్థాయిలో ఇంత క్రేజ్ రావటం. దానికి ఉదాహరణలో నిన్న బీహార్ లో అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన జనం. దేశం మొత్తం బిత్తరపోయింది. ఆ క్రౌడ్ ను చూసి. అయితే బన్నీ అంటే గిట్టని కొందరు కేజీఎఫ్ 2 సినిమానే పుష్ప 2 కోసం కాపీ కొట్టారంటూ కొన్ని పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. కేజీఎఫ్ 2 లో హీరోయిన్ చనిపోయినట్లు పుష్ప 2 లో కూడా శ్రీవల్లి చనిపోతుందని అందుకే సినిమా స్టోరీలు సేమ్ అయిపోయాయనే చాలా వరకూ మళ్లీ మార్చి తీశారని అందుకే ప్రాజెక్ట్ లేట్ అయిందనే విధంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 ట్రైలర్ ను  గమనిస్తే అందులో మాస్ట్ స్టఫ్ చాలానే కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 లో మ్యాచ్ అయిందని చెబుతున్న కొన్ని సీన్స్ పక్కనపెడితే..నిన్న రీలీజ్ అయిన ట్రైలర్ లోనే చాలా కథ చెప్పేశాడు సుకుమార్. ఆయన ప్రతీ సినిమాకు అంతే ట్రైలర్ లో కథ చెప్పేస్తారు. కానీ కథను నడిపించే విధానమే సుక్కూ మ్యాజిక్ ను చూపిస్తుంది. పుష్ప 2 కథ చూస్తే 1 ఎండింగ్ లో చెప్పినట్లు పుష్ప అనే పేరునే ఓ బ్రాండ్ గా మార్చి అల్లు అర్జున్ ఓ డాన్ లా ఎదిగిపోతాడు. రెడ్ శాండిల్ స్మగుల్ చేయాలంటే లోకల్ లో ఉన్న మనుషులను దాటి తనను తాను ఓ ఇంటర్నేషనల్ డీలర్ గా ప్రకటించుకుంటాడు. అందుకు సాక్ష్యమే ట్రైలర్ లో చూపించిన ఈ జపాన్ ఎపిసోడ్. ఇక్కడ జపాన్ మాఫియాతో రెడ్ శాండిల్ డీల్ మాట్లాడుకోవటం తో పాటు ఈ టికెట్ చూడండి. జనరల్ గా డీల్స్ ఓకే చేసుకోవటం హ్యాండోవరింగ్ కోసం ఇలా టికెట్స్ ఆర్ కరెన్సీ షేర్ చేసుకుంటారు. తర్వాత బన్నీ రేంజ్ మరింత పెరిగిపోతుంది. ట్రైలర్ లో చూపించినట్లు ఇప్పుడు పుష్ప గాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే ఈ కారులో డైలాగ్ దానికి రిలేటెడే. మరో వైపు శ్రీవల్లి తో ఫ్యామిలీ లైఫ్. భార్యకు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేలా తన కాలితో గడ్డం తిప్పుతూ తగ్గేదేలే డైలాగ్ చెప్పటం. సరదా అల్లర్లు అన్నీనూ. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఈ సీన్ చూడండి ఫస్ట్ పార్ట్ లో విలన్లు, హీరోలను ఒకేరీతిలో చితక్కొట్టిన షెకావత్ ఇప్పుడు మంగళం శీనుతో కలిసిపోయినట్లు ఉన్నాడు. గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ చీరకట్టుకుని చేసే ఈ సీన్, ఫైట్ కి సినిమాలో ఏదో క్రూషియల్ స్పేస్ ఉన్నట్లు ఉంది. దీని తర్వాత షాట్స్ లో జపాన్ లో డీల్ ఫెయిల్ అయ్యేలా ఎవరో పుష్ప కు అడ్డుపడ్డారు. పుష్ప ను కట్టేసి కొడుతున్న సీన్స్ కూడా చూపించారు ట్రైలర్ లో. మే బీ ఈ గ్యాప్ లో తన భార్యను కూడా చంపేసినట్లున్నారు. ఎవరిదో అంత్యక్రియల్లో పుష్ప ఉన్నాడు. ఈ సీన్ నే కేజీఎఫ్ తో కంపేర్ చేస్తున్నారు. వీటన్నింటిని దాటుకుని ఓ వైపు షెకావత్, మంగళం శ్రీను గ్యాంగ్స్ మరో వైపు పొలిటికల్ ప్రెజర్స్...మరో వైపు జపాన్ డీలింగ్ వీటన్నింటిని వర్కవుట్ చేసుకునే పుష్పనే ఈ షిప్ ఎపిసోడ్ లోకి దిగినట్లుగా కూడా ట్రైలర్ లోనే చూపించారు. సో మాస్ ఎలివేషన్స్, అండ్ సుక్కూ రేంజ్ స్క్రీన్ ప్లే మీద గట్టి నమ్మకమైతే కలిగించింది ట్రైలర్. మరి కేజీఎఫ్ స్టోరీనే  కాపీ కొట్టారా చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram