Prabhas Tweet on Marriage | ఇన్ స్టా లో ఆసక్తికర పోస్టు పెట్టిన ప్రభాస్ | ABP Desam

Continues below advertisement

 రెబల్ స్టార్ ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. అదేం న్యూసో తెలియదు కానీ గుడ్ న్యూస్ అనైతే ప్రభాస్ చెప్పారు. ఈ రోజు ఇన్ స్టా లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు ప్రభాస్. హాయ్ డార్లింగ్స్ మన జీవితాల్లోకి ఓ స్పెషల్ వస్తున్నారు. డీటైల్స్ చెప్తా వెయిట్ చేయండి అంటూ చిన్న పోస్ట్ పెట్టారు ప్రభాస్. ఇంకేముంది మా డార్లింగ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. ఏదైనా ప్రాజెక్ట్ ఆర్ సినిమా అయితే ప్రభాస్ ఇలా ముందస్తు ట్వీట్స్ ఇన్ స్టా పోస్టులు పెట్టరు. జనరల్ గా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ప్రభాస్ సడెన్ గా ఇలా జీవితంలోకి స్పెషల్ పర్సన్ అంటూ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. బాలయ్య అన్ స్టాపబుల్ లో లైఫ్ లోకి ఎవరు వస్తున్నారు శెట్టినా లేదా సనన్ అంటూ బాలయ్య ప్రభాస్ ను ఆటపట్టించిన విషయం అందరీకి గుర్తుంటుంది. అప్పుడు బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ చేయటం చరణ్ ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాడంటూ ప్రకటించటం జరిగిపోయాయి. ఆ ఎపిసోడ్ ఆ అమ్మాయి ఎవరు అనే చర్చ నడిచినా ఇప్పుడు సడెన్ గా ప్రభాస్ ఇన్ స్టా లో పోస్ట్ పెట్టడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఫ్యాన్స్ అయితే ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా ఏళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టారు. ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 44సంవత్సరాలు కాగా అనుష్క వయస్సు 42 సంవత్సరాలు. మరి ప్రభాస్ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ అంతా ఊహించుకుంటున్న పెళ్లి న్యూసేనా లేదా వేరే ఏదన్నా సారీ డార్లింగ్స్ అంటాడా చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram